Sunday, December 24, 2006

ఎంత నేర్చిన (త్యాగరాజ, రాగం ఉదయరవిచంద్రిక)


పల్లవి:
ఎంత నేర్చిన ఎంత జుచిన ఎంతవారలైన కాంతదాసులే

అనుపల్లవి:
సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేని వారు

చరణం:
పరహింస పరభామ అన్యధన పరమానవపవాద
పరజీవనములకంమృతమే భాశించెరైయ్య త్యాగరాజనుత

Sunday, December 03, 2006

అఖిలాండేశ్వరీ (ముత్తుస్వామి దీక్షితార్, రాగం ద్విజావంతి)

పల్లవి:
అఖిలాండేశ్వరీ రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ

అనుపల్లవి:
నిఖిల లోక నిత్యాత్మికే విమలే నిర్మలే శ్యామలే సకల కలే

చరణం:
లంబోదర గురుగుహ పూజితే లంబాలకోద్భాసితే హసితే
వాగ్దేవ తారాధితే వరదే వరశైలరాజనుతే శారదే
జంభారి సంభావితే జనార్దననుతే ద్విజావంతి రాగనుతే
ఝల్లి ఝర్ఝర వాద్య నాద ముదితే జ్ఞానప్రదే

Sunday, November 19, 2006

జో అచ్చుతానంద (అన్నమయ్య, రాగం నవరోజ్)


పల్లవి:
జో అచ్చుతానంద జో జో ముకుందా
రావె పరమానంద రామగోవింద

చరణం:
నందునింటను జేరి నయము మీరంగ
చంద్ర వదనలు నీకు సేవచేయంగ
అందముగ వారింట్ల ఆడుచుందంగ
మండలకు దోంగ మా ముద్దు రంగ

అంగజుని కన్న మాయన్న యిటురారా
బంగారు గిన్నెల్లో పాలు పోసేరా
దోంగ నీవని సతులు పోంగుచున్నారా
ముంగిట ఆడరా మోహనాకార

అంబుగా తాళ్ళపాకన్నమయ్య చాల
శృగార రచనగా చెప్పెనే జోల
సంగతిగ సకల సంపదలనీవేల
మంగళము తిరుపట్ల మదన గోపాల