Tuesday, February 07, 2006

పలుకే బంగారమాయనా (భద్రాచల రామదాసు, రాగం ఆనందభైరవి)

పల్లవి:
పలుకే బంగారమాయనా కోదండపాణి

చరణం:
పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువను చక్కనితండ్రి

ఎంత వేడీనకాని తుంటైన దయ రాదు
పంతముసేయ నేనెంతటివాడను తండ్రి

శరణాగతత్రాణ బిరుదాంగుడవుకావా
కరుణించి భద్రాచల వర రామదాస పోశ