Showing posts with label అన్నమయ్య. Show all posts
Showing posts with label అన్నమయ్య. Show all posts

Thursday, August 23, 2007

శ్రీమన్నారాయణ (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణం

అనుపల్లవి:
కమలాసతీముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమేశరణం

చరణం:
పరమయోగిజన భాగదేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువెంకటగిరిదేవ శరణం

Tuesday, May 01, 2007

భావములోన (అన్నమయ్య, రాగం శుద్ధ ధన్యాసి)

పల్లవి:
భావములోన భాహ్యములందును గోవింద గోవింద అని కోలువవో మనసా

చరణాలు:
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి హరి అనవో మనస

విశ్ణుని మహిమలే విహిత కర్మములు విశ్ణుని పోగడేడి వేదంబులు
విశ్ణుడోక్కడే విశ్వాంతరాత్ముడు వీశ్ణువు విశ్ణువని వెదకవో మనస

అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుడు శ్రీ వేంకటాద్రీ మీదనితె అచ్యుత అచ్యుత శరణనవో మనస

Wednesday, April 18, 2007

తందనాన అహి (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
తందనాన అహి తందనాన పురే తందనాన భళా తందనాన
భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట

చరణాలు:
కండువగు హీనాథికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా
ఇందులో జంతుకులం ఇంతానోకటే అందరికి శ్రీహరే అంతరాత్మా

నిండార రాజు నిద్రించు నిద్రయు ఓకటే అండనే బంటు నిత్ర అదియు ఓకటే
మెండైన బ్రహ్మణుడు మేట్టు భూమి ఓకచటే చండాలుడుండేటి సరి భూమి ఓకటే

అనుగు దేవతలకును అల కామసుఖమోకటే ఘనకీట పశువులకు కామ సుఖం ఓకటే
దినమహేరాత్రములు తేగి ధనాద్యునకోకటే వోనర నిరుపేదకును ఓకటే అవియు

కోరలు శిశ్టాన్నములు గోను నక్కలోకటే తిరుగు దుశ్టాన్నములు దిను నక్కలోక్కటే
పరగు దుర్గంథములపై వాయువోక్కటే వరుశ పరిమళముపై వాయువోకటే

కడగి యేనుగు మీద కాయు ఎంద ఓకటై పుడమి శునకముమీత పోడయునెండోకటే
కడు పుణ్యలను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామమోకటే

Sunday, November 19, 2006

జో అచ్చుతానంద (అన్నమయ్య, రాగం నవరోజ్)


పల్లవి:
జో అచ్చుతానంద జో జో ముకుందా
రావె పరమానంద రామగోవింద

చరణం:
నందునింటను జేరి నయము మీరంగ
చంద్ర వదనలు నీకు సేవచేయంగ
అందముగ వారింట్ల ఆడుచుందంగ
మండలకు దోంగ మా ముద్దు రంగ

అంగజుని కన్న మాయన్న యిటురారా
బంగారు గిన్నెల్లో పాలు పోసేరా
దోంగ నీవని సతులు పోంగుచున్నారా
ముంగిట ఆడరా మోహనాకార

అంబుగా తాళ్ళపాకన్నమయ్య చాల
శృగార రచనగా చెప్పెనే జోల
సంగతిగ సకల సంపదలనీవేల
మంగళము తిరుపట్ల మదన గోపాల

Saturday, November 04, 2006

ముద్దుగారే యశోద (అన్నమయ్య, రాగం కురింజి)

పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

చరణం:
అంతనింత గోల్లేతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసునీ పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృశ్నుడు

రతికేళి రుక్మిణికీ రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము
గతేయె మమ్మూగాచే కమలాక్షుడూ

కాళింగుని తలపై గప్పిన పుశ్యరాగము
యోలేటి శ్రీవెంకటాద్రీ ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయనీ దివ్య రత్నము
బాలునివలే తిరిగే పద్మనాభుడు