Friday, April 27, 2007

శివ శివ శివ అనరాద (త్యాగరాజు, రాగం కామవర్ధిని)

పల్లవి:
శివ శివ శివ అనరాద ఓరీ

అనుపల్లవి:
భవ భయ బాధలననచుకోరాదా

చరణాలు:
కామాదులతెగకోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము ఎడబాసీ అతి నేమముతో బిల్వార్చన జేసి

సజ్జన గణముల గాంచి ఓరీ ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల తోలగించ తన హ్రజ్జలమునను తో పూజించి

అగముల నుతియించి బహు బగులేని భాశలను చలించి
భగవతులలో పోశించి ఓరీ త్యాగరాజ సన్నుతుడని ఎంచి

Tuesday, April 24, 2007

దేవాదిదేవ సదాశివ (త్యాగరాజు, రాగం సింధు రామక్రియా)

పల్లవి:
దేవాదిదేవ సదాశివ దీననాథ సుధాకర దహన నయన

అనుపల్లవి:
దేవేశ పితామహ మృగ్య శమాది గుణాభరణ గోరీ రమణ

చరణం:
భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాశ శ్రీశనుత
తవపాదభక్తిం దేహి దీనబంధో దరహాసవదవ త్యాగరాజనుత

ఉయ్యాలలూగవయ్య (త్యాగరాజు, రాగం నీలాంబరి)

పల్లవి:
ఉయ్యాలలూగవయ్య శ్రీ రామా

అనుపల్లవి:
సయ్యాట పాటలను సత్సార్వభౌమ

చరణాలు:
కమలజాద్యఖిల సురులు నిను కోలువ
విమలులైన మునీంద్రులు ద్యానింప
కమనీయ భాగవతులు గుణ కీర్తనములు నాలాపంబుల సేయగ

నారదాదులు మెరయూచూ స్తుతియింప
సారములు బాగా వినుచూ నీన్ను
నమ్మువారల సదా బ్రోచుచూ వేద సార సఫలను జూచుచూ శ్రీ రామ

నవ మోహనాంగులైన సురసతులు వివరముగ పాడగ నీ భాగ్యమా
నవరత్న మంటపమున త్యాగరాజ వినుతాకృతీ బూనిన శ్రీ రామ

శ్రీ తులసమ్మ (త్యాగాజూ, రాగం దేవగాంధారి)

పల్లవి:
శ్రీ తులసమ్మ మాయింట నేలకోనవమ్మ ఈ మహిని
నీ సమానమేవరమ్మ బంగారు బోమ్మ

చరణాలు:
కరగు సుపర్ణపు సోమ్ములు బెట్టి
సరిగే చిర ముద్దు గురియ గట్టి
కరుణ జూచి సిరులనుయోడి గట్టి
పరదుని కరమునను బట్టి

యురమున ముత్యపు సరులసియడ
సురతరుణులు నిన్ను గని కోనియడ
వర మునులాష్ట దిగీశులు పేడ
వరదుడు నిన్ను ప్రేమ జూడ

మరువక పారిజాత సరోజ
కురవక వకుళ సుగంధరాజ
వర సమములచే త్యాగరాజ
వరద నిన్ను పూజ సేతు

Friday, April 20, 2007

మోరు సమాన (త్యాగరాజు, రాగం మాయామాళవగౌళ)

పల్లవి:
మోరు సమాన ధీర వరదా రఘువీర జుదము రారా మహా

అనుపల్లవి:
సరసర ఓయ్యారవు నడలను నీరద కాంతిని నీథీవిని మహా

చరణం:
అలకల ముద్దును తిలకపు తీరును తళుకు జెక్కులచే దనరు మెమ్మోమును
గళమున శోభిల్లు కనక భూశణముల దళిత దుర్మానవ త్యాగరాజార్చిత

Wednesday, April 18, 2007

రామా దైవమా (త్యాగరాజు, రాగం శూరుట్టీ)

పల్లవి:
రామా దైవమా
రాగ రాగ లోభామా

అనుపల్లవి:
మోము జూపుమా జగన్మోహనకరమా

చరణం:
నేర్పు జూపు అంగలార్పు బాపుమా
ఓర్పు గల్గు త్యాగరాజు ఓక్క సారి శరనన్టే

తందనాన అహి (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
తందనాన అహి తందనాన పురే తందనాన భళా తందనాన
భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట

చరణాలు:
కండువగు హీనాథికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా
ఇందులో జంతుకులం ఇంతానోకటే అందరికి శ్రీహరే అంతరాత్మా

నిండార రాజు నిద్రించు నిద్రయు ఓకటే అండనే బంటు నిత్ర అదియు ఓకటే
మెండైన బ్రహ్మణుడు మేట్టు భూమి ఓకచటే చండాలుడుండేటి సరి భూమి ఓకటే

అనుగు దేవతలకును అల కామసుఖమోకటే ఘనకీట పశువులకు కామ సుఖం ఓకటే
దినమహేరాత్రములు తేగి ధనాద్యునకోకటే వోనర నిరుపేదకును ఓకటే అవియు

కోరలు శిశ్టాన్నములు గోను నక్కలోకటే తిరుగు దుశ్టాన్నములు దిను నక్కలోక్కటే
పరగు దుర్గంథములపై వాయువోక్కటే వరుశ పరిమళముపై వాయువోకటే

కడగి యేనుగు మీద కాయు ఎంద ఓకటై పుడమి శునకముమీత పోడయునెండోకటే
కడు పుణ్యలను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామమోకటే

నన్ను పాలింవ (త్యాగరాజు, రాగం మోహనం)

పల్లవి:
నన్ను పాలింప నదచివచ్చితివో నా ప్రాణనాథ

అనుపల్లవి:
వనజనయన మోమున జూచుట జీవనమని నేనరున మనసు మర్మము తేలిసి

చరణం:
సురపతి నీలమణినిభ తనువుతో యురమున ముత్యపుసరుల చయముతో
కరమున శర కోదంఢ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత

రామచంద్రేణ సంరక్షితోహం (ముత్తుస్వామి దీక్షీతార్, రాగం మాంజి)

పల్లవి:
రామచంద్రేణ సంరక్షితోహం సీతా

అనుపల్లవి:
రమా భారథీ గౌరీ రమణ స్వరూపేణ శ్రీ

చరణాలు:
కామకోటీ సుందరేణ కమనీయ కంధరేణ
కోమల ఘనశ్యామేణ కోదండ రామేణ

మామవ హృదయస్థితేన మారుతి గీతామృతేన
మాంజీరమణి మండిత మద్గురుగుహ మానితేన

Friday, April 06, 2007

ఏ తావునరా (త్యాగరాజు, రాగం కల్యాణి)

పల్లవి:
ఏ తావునర నిలకద నీవు ఎంచి జుడ నగపడవు

అనుపల్లవి:
సీతా గౌరీ వాగీశ్వరీ యను శ్రీ రూపములందా గోవిందా

చరణం:
భూ కమలార్క నీలనభనందా లోకకోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత శివ మాథవ భ్రహ్మాదులయందా