Showing posts with label మోహనం. Show all posts
Showing posts with label మోహనం. Show all posts

Wednesday, April 18, 2007

నన్ను పాలింవ (త్యాగరాజు, రాగం మోహనం)

పల్లవి:
నన్ను పాలింప నదచివచ్చితివో నా ప్రాణనాథ

అనుపల్లవి:
వనజనయన మోమున జూచుట జీవనమని నేనరున మనసు మర్మము తేలిసి

చరణం:
సురపతి నీలమణినిభ తనువుతో యురమున ముత్యపుసరుల చయముతో
కరమున శర కోదంఢ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత

Thursday, June 16, 2005

ఎవరురా (త్యాగరాజు, రాగం మోహనం)

పల్లవి:
ఎవరురా నిన్నువినా గతి మాకు

అనుపల్లవి:
సవనరక్షక నిత్యోత్సవ సీతాపతి

చరణం:
రాదా నాదుపై నీ దయ వినరాదా మురవైరికాదా దయ పల్కరాదా
ఇది మరియాదా నాతో వాదమా నీ భేదమా మాకు

రాక నన్నేచ న్యాయమా పరాకా నేన్నటే హేయమా రామా
రాకాశశిముఖ నీ కాశించితి సాకు మా పుణ్య శ్లోకమా మాకు

శ్రీశారి గనారాతివి దాస తెలియక పోతివి ఆపగేశార్చిత
పాలితేశ నా ప్రకాశమా స్వప్రకాశమా మాకు

రాజా బిగు నీకేలరా త్యాగరాజార్చిత తాళజాలరా రామా
ఈ జాలము సేయ రాజ బ్రోవ సంకోచమా సురభూజమా మాకు