Sunday, December 24, 2006

ఎంత నేర్చిన (త్యాగరాజ, రాగం ఉదయరవిచంద్రిక)


పల్లవి:
ఎంత నేర్చిన ఎంత జుచిన ఎంతవారలైన కాంతదాసులే

అనుపల్లవి:
సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ చింతలేని వారు

చరణం:
పరహింస పరభామ అన్యధన పరమానవపవాద
పరజీవనములకంమృతమే భాశించెరైయ్య త్యాగరాజనుత

Sunday, December 03, 2006

అఖిలాండేశ్వరీ (ముత్తుస్వామి దీక్షితార్, రాగం ద్విజావంతి)

పల్లవి:
అఖిలాండేశ్వరీ రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ

అనుపల్లవి:
నిఖిల లోక నిత్యాత్మికే విమలే నిర్మలే శ్యామలే సకల కలే

చరణం:
లంబోదర గురుగుహ పూజితే లంబాలకోద్భాసితే హసితే
వాగ్దేవ తారాధితే వరదే వరశైలరాజనుతే శారదే
జంభారి సంభావితే జనార్దననుతే ద్విజావంతి రాగనుతే
ఝల్లి ఝర్ఝర వాద్య నాద ముదితే జ్ఞానప్రదే

Sunday, November 19, 2006

జో అచ్చుతానంద (అన్నమయ్య, రాగం నవరోజ్)


పల్లవి:
జో అచ్చుతానంద జో జో ముకుందా
రావె పరమానంద రామగోవింద

చరణం:
నందునింటను జేరి నయము మీరంగ
చంద్ర వదనలు నీకు సేవచేయంగ
అందముగ వారింట్ల ఆడుచుందంగ
మండలకు దోంగ మా ముద్దు రంగ

అంగజుని కన్న మాయన్న యిటురారా
బంగారు గిన్నెల్లో పాలు పోసేరా
దోంగ నీవని సతులు పోంగుచున్నారా
ముంగిట ఆడరా మోహనాకార

అంబుగా తాళ్ళపాకన్నమయ్య చాల
శృగార రచనగా చెప్పెనే జోల
సంగతిగ సకల సంపదలనీవేల
మంగళము తిరుపట్ల మదన గోపాల

Saturday, November 04, 2006

ముద్దుగారే యశోద (అన్నమయ్య, రాగం కురింజి)

పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

చరణం:
అంతనింత గోల్లేతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసునీ పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృశ్నుడు

రతికేళి రుక్మిణికీ రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము
గతేయె మమ్మూగాచే కమలాక్షుడూ

కాళింగుని తలపై గప్పిన పుశ్యరాగము
యోలేటి శ్రీవెంకటాద్రీ ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయనీ దివ్య రత్నము
బాలునివలే తిరిగే పద్మనాభుడు

నిరవధి సుఖదా (త్యాగరాజు, రాగం రవిచంద్రిక)

పల్లవి:
నిరవధి సుఖదా నిర్మల రూప నీర్జిత మనిశాపా

అనుపల్లవి:
శరధి బందన నత సంక్రందన శంకరాది గీయమాన సాధు మానస సుసదన

చరణం:
మామవ మరకట మణినిభదేహ శ్రీమణిలోల శ్రితజన పాల
భీమ పరాక్రమ భీమ కరార్చిత తామస మానవ దూర త్యాగరాజ వినుత చరణ

Friday, August 11, 2006

సాధించెనే (రాగం ఆరాభి)

పల్లవి:
సాధించనే ఓ మనసా

అనుపల్లవి:
బోధించిన సన్మార్గవచనముల బోంగు జేసి త బట్టిన పట్టు

చరణం:
సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవులన్ నెగించినటు

రంగేశుడు సద్గంగాజనకుడు సంగీత సాంప్రదాయకుడు

గోపీజన మనోరతంబోసంగ లేకనే గేలియు జేసే వాడు

వనితల సదా సోక్క జేయుచును మ్రోక్క జేసే పరమాత్ముడదియుగాక
యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి

పరమ భక్తవత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మనఘుడై
కలి బాధలుతీర్చువాడనుచునే హృదంబు జమున జూచుచుండగ

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేశ శయన పరనారీసోదరాజ
విరాజతురగరాజ రాజనుత నిరామయ పఘన సరసీరుహదళాక్ష
యనుచు వేడుకోన్న నన్ను తా బ్రోవకను

శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధర
లసన్ముకుట కుండల వారాజిత హరే యనుచు నే పోగడగా త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడైన రామచంద్రుడు

సద్భక్తుల నడతలిట్లనెనే అమరికగా నా పూజకోనెనే అలుగవద్దనెనే
విముఖులతో జేరబోకుమనెనే వెట కల్గిన తాళుకోమ్మనెనే
దమశమాది సుఖదాయకుడగు శ్రీత్యాగరాజ సుతుడు చెంతరాకనే


జగదానందకారకా (రాగం naTTai)

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా

గగనాధిపసత్కులజా రాజరాజేశ్వరా సుగుణాకర సురసేవ్య భవ్యదాయకా సదా సకల

అమరతారక నేచయ కుముదహిత పరిపూర్ణ నఘ సుర సురభూజ
దధి పయోధివాసా హరణ సుందరతరవదన సుధామయ వచో బృంద
గోవింద సానంద మా వరాజరాప్త శుభకరా అనేక

నిగమనీరజాంమృత పోశకా నిమిశవైరి వారిద సమీరన
ఖగ తురంగ సత్కవిహృదాలయా అగణిత వానరాధిప నతాంఘ్రియుగ

ఇంద్రనీలమణిసన్నిభ పఘన చంద్రసూర్యనయన అప్రమేయ
వాగీంద్రజనక సకలేశ శూభ్ర నాగేంద్రశయన శమనవైరిసన్నుత

పాదవిజితమైనిశాప సవ పరిపాల వర మంత్ర గ్రహణలోల
పరమశాంతచిత్త జనజాథిప సరోజభవ వరదా అఖిల

సృశ్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతిసుతా అబ్దిమదహరణా యురాగరాగ రాజిత కథ సారహిత

సజ్జనమానసాబ్దిసుధాకర కుసుమవిమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణా వగుణ సురగణ మదహరణ సనాతనాజనుత

ఓంకారపంజరకీర పురహర సరోజభవ కేశవాదిరూప వాసనరిపు
జనకాంతక కళాదరాప్త కరుణాకర శరణాగత జనపాలన సుమనో
రమణ నిర్వికార నిగమ సారతర

కరథ్రతశరజాల సురమదాపహరణ వనీ సుర సురావన కవీన
బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత

పురాణపురుశ న్వరాత్మజాశృత పరాధీన కర విరాధ రావణ
విరానణా నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత

అగణిత గుణ కనకచేల సాల విదలనారుణాభ చరణ అపారమహిమాద్భుత
సుకవిజన హృదసదన సురమునిగణ విహిత కలశ నీర
నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాదినుత

Saturday, July 15, 2006

ఎందరో మహానుభావులు (రాగం శ్రి)

పల్లవి:
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అనుపల్లవి:
చందురూవర్ణుని అందచందమునూ హృదయారవిందమున జుచి బ్ర్మహానందమనుభవించువారెందరో

చరణం:
సామగానలోల మనసిజలావణ్య ధన్యు మూర్ధన్యులెందరో

మానసవనచరవర సంచారము నిలిపి మూర్తి బగుగా పోగడనే వారెందరో

సరగుణ పాదములకు స్వాంతమును సరోజమును సమర్పణము సేయుపారెందరో

పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమార్గముతోను పాడుచును సల్లాపముతో స్వరలయాదిరాగములు తెలియువారెందరో

హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటులిలలో తెలివితో చెలిమితో కరుణగల్గి జగమెల్లను సుధాదృశ్టిచే బ్రోచువారెందరో

హోయలు మీర నదలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులకశరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశముగలవారెందరో

పరమభాగవత మోనివరశశి విభాకర సనక సనందన దిగిశ సుర కింపురుశ కనకక కశిపు సుత నారద తుంబురూ పవనసూను భాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదానుభవులుగాక ఎందరో

నీ మేను నామవైభవంబులను ని పరాక్రమ ధేర్యము శాంతమానసము నీవులను వచన సత్యమును రఘువర నీయడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమదినెరింగి సంతతంబునను గుణ భజనానంద కిర్తనము సేయువారెందరో

భాగవత రామాయణ గితాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాతి శంన్మతముల గూఢములన్ మప్పది ముక్కోటి సురాంతరంగములభావంబులనెరిగి భావరాగలయాది సోఖ్యముచే చిరాయువుల్గల్గి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవారెందరో

ప్రేమమూపిరి గోనువేళ నామమునుతలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనవారెందరో





కన కన రుచిరా (రాగం వరాళి)

పల్లవి:
కన కన రుచిరా కనకవసన నిన్ను

అనుపల్లవి:
దినదినమును అను దినదినమును మనసున చనువున నిన్ను

చరణం:
పాలుగారు మోమున శ్రీ అపార మహిమ దనరు నీన్ను

తళతళమను ముఖ కళ గలిగిన సీత కులుకుచూ ఓర కన్నులను జుచె నిన్ను

బాలార్కాభిసుచేల మణిమయ మాలాలంకృత కంధర సరసిజాక్ష
వరకపోల సురుచిర కిరీట ధర సంతతంబు మనసారగ

సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణశూమైన మాటలు వీనుల జురూకున తాళక శ్రీహరిని థ్యానించి సుఖియింపగలేదా యటు

మృదమదలలామ శుభనితిలవర జటాయు మోక్ష ఫలద పవమానసుతుడు నీదు మహిమ తెల్ప సీత తెలిసి వలచి సోక్క లేదా రీతి నిన్ను

సుఖాస్పదా విముఖాంబుదర పవన విదేహ మానస విహారాప్త సురపుజ మానిత గుణాంక చిదానంద ఖగతురంగ ధృతరథాంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే

కామించీ ప్రేమమీర కరముల నీదు పాద కమలముల్పట్టుకోన్నవాడు సాక్షి రామనామ రసికుడు కైలాససదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శోనక పురంధర నగజ ధరజ ముఖ్యులు సాక్షి కాద సుందరేశ సుఖ కలశాంబుదివాస శ్రితులకే

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముద హిత వరదా నిన్ను



Tuesday, July 11, 2006

Finally!

I discovered yesterday that I am able to edit my blog and create new posts, after a gap of nearly nine months. Back in September of 2005, blogger started having trouble publishing my blog and stopped adding any new posts I'd make. The progress page would endlessly loop at the 7% mark when I'd try to publish. I found some discussion on that net that seemed to suggest that this was a problem with many non-English blogs. Blogger seems to have finally fixed this problem.

So, yep, watch this space for more posts. :)

Also, you guys may have noticed that the blog title has change from "త్యాగరాజ కృతులు" to "తెలుగు కృతులు". I'll be trascribing songs by other poets too. However, I intend to limit the content to compisitions of a spiritual/devotional nature.

Tuesday, February 07, 2006

పలుకే బంగారమాయనా (భద్రాచల రామదాసు, రాగం ఆనందభైరవి)

పల్లవి:
పలుకే బంగారమాయనా కోదండపాణి

చరణం:
పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువను చక్కనితండ్రి

ఎంత వేడీనకాని తుంటైన దయ రాదు
పంతముసేయ నేనెంతటివాడను తండ్రి

శరణాగతత్రాణ బిరుదాంగుడవుకావా
కరుణించి భద్రాచల వర రామదాస పోశ

Saturday, January 21, 2006

శోభనే (త్యాగరాజు, రాగం కామవర్ధిని)

వదన ద్యుతి జిత సోమ వసుధా మానవ కామ
మద మానవ గణ భీమ మామ్పాహి శ్రీరామా

జనకసుతా హృద్రమణ జమదగ్నిజ మదహరణ
ప్రణతాఘానల వరుణ పాహిమామ్ ముని శరణ

విగళిత మోహపాశ విధుకోటి సంకాశ
భగవన్ సకలాధీశ్ పాహీ పాప వినాశ

వర త్యాగరాజనుత వారిజసంభవ తాత
పరమ కల్యాణయుత పాహిమామ శుభచరిత

ఎన్నాగ మనసుకు రాని (త్యాగరాజు, రాగం నీలాంబరి)

వల్లవి:
ఎన్నాగ మనసుకు రాని పన్నగషాయీ సోగసూ
పన్నుగ కనుగోననీ కన్నులేలే కంటీ మిన్నలేలే

చరణం:
మోహముతో నీలవారీ వాహ కాంతీని గేరిన
శ్రీహరినీ గట్టుకోననీ దేహమేలే ఈ గేహమేలే

సరసిజ మల్లే తులసీ వీరుజాజి పారిజాతపు
విరులచే పూజించనీ కరములేలే ఈ కాపూరములేలే

మలిమితో త్యాగరాజునేలిన రామమూర్తినీ
లాలించి పోగడనీ నాలికేలే సూత్రమాలికేలే