Monday, September 12, 2005

సుజన జీవన (త్యాగరాజు, రాగం కమాస్)
sujana jIvana (tyAgarAju, rAgam kamAs)

పల్లవి:
pallavi:

సుజన జీవన రామా సుగుణ భూశణ
sujana jIvana rAma suguNa bhUshaNA

అనుపల్లవి:
anupallavi:

భుజగభూశణార్చిత బుధజనావనా అజవందిత శృతచందన ధశతురంగ మామవ
bhujagabhUshaNArcita budhajanAvanA ajavandita shRitacandana dashaturanga mAmava

చరణం:
caranam:

చారునేత్ర శ్రీకళత్ర శ్రీరమ్యగాత్ర తారకనామ సుచరిత్ర దశరథవుత్ర
cArunetra shrIkaLatra shrIramyagAtra tArakanAma sucaritra dasharathaputra
తారకాధిపానన ధర్మపాలకా తారయ రఘువర నిర్మల త్యాగరాజ సన్నుత
tArakAdhipAnana dharmapAlakA tAraya raghuvara nirmala tyAgarAja sannuta

Friday, August 05, 2005

దినమణి వంశ (త్యాగరాజు, రాగం హరికాంభోజి)


పల్లవి:
దినమణి వంశ తిలకలావణ్యా దీన శరణ్య

అనుపల్లవి:
మనవిని బాగుగా మదిని దలంచుచూ చనువునన్నేలు జాలు

చరణం:
శర్వ వినుత నన్ను సంరక్షించను గర్వము ఏల గాచు వారెవరే
నిర్వికార గుణ నిర్మల కరధృతపర్వత త్యాగరాజ సర్వస్వమో

మరుగేలరా ఓ రాఘవా (త్యాగరాజు, రాగం జయంతశ్రీ)పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా

అనుపల్లవి:
మరుగేలరా చరాచరరూప పరాత్పర సుర్యసుధాకరలోచనా

చరణం:
అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికోంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నోరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత

Wednesday, July 20, 2005

రామా కోదండరామా (త్యాగరాజు, రాగం భైరవి)

పల్లవి:
రామా కోదండరామా రామా కల్యణరామా

చరణం:
రామా సీతాపతి రామా నీవే గతి
రామా నీకు మ్రోక్కితి రామా నీ చేచిక్కితి

రామా నీకేవరు జోడు రామా క్రిగంట చూడు
రామా నేను నీవాడు రామా నాతో మాటాడు

రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామా నీవు నన్నేలు రామ రాయడే చాలు

రామా నీదోక్కమాట రామా నాకోక్కమూట
రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట

రామా నేనండైనను రామా వేరెంచలేను
రామా ఏన్నడైనను రామా బాయకలేను

రామా విరాజరాజ రామా ముఖజీత రాజ
రామా భక్తసమాజ రక్షిత త్యాగరాజ

లావణ్య రామా (త్యాగరాజు, రాగం పూర్ణశడ్జం)

వల్లవి:

లావణ్య రామా కన్నులారా చూడవే అతి

అనుపల్లవి:
శ్రీ వనితా చిత్త కుముదా సీతాకర శతాననజన్య

చరణం:
నీ మనసూ నీ సౌగసు నీ దినుసూ వేరే
తమసమాన దైవమేల త్యాగరాజనుత దివ్య


(1) Pallavi audio: Excerpt from Veena recital by Veena R. Jayathi, iTunes.

Tuesday, July 19, 2005

సీతమ్మ మాయమ్మ (త్యాగరాజు, రాగం వసంత)

పల్లవి:
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకుతండ్రి

అనుపల్లవి:
వాతాత్మజ సౌమిత్రీ వైనధేయ రిపుమర్దన
ధాతా భరతాదులు సోదరులు మాకు ఓ మనస

చరణం:
పరమేశ వసిశ్ట పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధరణిజ భార్గవతాఘ్రే సరులేవ్వరు వరేల్లను
వర త్యాగరాజునికి పరమబాంధవులు మనస

Thursday, June 30, 2005

బాలకనకమయ (త్యాగరాజు, రాగం అతాన)


వల్లవి:
ఏల నీ దయరాదు పరాకు జేసే వేళ సమయముకాదు

అనుపల్లవి:
బాలకనకమయచేల సుజనపరిపాల శ్రీరమాలోల విఢృతశరజాల
శుభదకరుణాలవాల ఘననీల నవ్యవనమాలికాభరణ

చరణం:
రారా దేవాదిదేవ రారా మహానుభావ రారా రాజీవనేత్ర రఘువరపుత్ర
సారతరసుధాపూరహృదయపరివార జలధిగంభీర దనుజసంహార
మదనసుకుమార బుధజనవిహార సకలశ్రుతిసార నాదుపై

రాజాధిరాజ మునిపూజితపాద రవిరాజలోచన శరణ్య అతిలావణ్య
రాజధరనుత విరాజతురగ సురరాజవందితపదాబ్జ జనక
దినరాజకోటిసమతేజ దనుజగజరాజ నిచయ మృగరాజ జలజముఖ

యాగరక్షణ పరమభాగవతార్చిత యోగీంద్రసుహృద్భావిత ఆద్యంతరహిత
నాగశయన వరనాగవరద పున్నాగసుమధర సదాఘమోచన
సదాగతిజధృతపాద ఆగమాంత చరరాగరహిత శ్రీ త్యగరాజనుత

Friday, June 24, 2005

గానమూర్తే (త్యాగరాజు, రాగం గానమూర్తి)

పల్లవి:
గానమూర్తే శ్రీ కృష్ణ వేణుగాన లోల త్రిభువనపాల

అనుపల్లవి:
మణినీమణి శ్రీరుక్మిణీ మానసాపహార మారజనక దివ్య

చరణం:
నవనీత చోర నందనత్కిషోర నరమిత్రధీర నరసింహశుర
నవమేఘతేజ నగజాసహజా నరకాంతకాజ నట త్యాగరాజ

Monday, June 20, 2005

మనవ్యాలకించరాదటే (త్యాగరాజు, రాగం నళినకాంతి)

పల్లవి:
మనవ్యాలకించరాదటే మర్మమెల్లదెల్పెదనే మనసా

అనుపల్లవి:
ఘనుడైన శ్రీ రామచంద్రునీ కరుణాంతరంగము తెలిసిన నా

చరణం:
కర్మకాండ మద కృష్టులై భవ గగనచారులై కాశి చెందక
కనిమానవావతారుడై కనిపించినాడే నటన త్యాగరాజు

Saturday, June 18, 2005

బ్రోచేవారెవరే (త్యాగరాజు, రాగం శ్రీరంజనీ)

పల్లవి:
బ్రోచేవారేవరే రఘుపతే

చరణం:
నిన్నువినా బ్రోచేవారేవరే

శ్రీ రామా నెనరున బ్రోచేవారెవరే

సకలలోకనాయక బ్రోచేవారెవరే

నరవరనీసరి బ్రోచేవారెవరే

దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగి సదా

వాలినొక్కకోలజేసి రవిబాలుని రాజుగా కావించి జూచి

మునిసబంబు జుడవెంటి జని ఖరమారీచాదుల హతంబుజేసి

భవాబ్ది తరుణోపాయమునేరని త్యాగరాజునికరంబిడి


Note: This page marks every line but the first as a చరణం. This is different from I've usually seen. If you think this might be wrong, let me know. Please also let me know the "correct" labelling.

Friday, June 17, 2005

పరియాచకమా (త్యాగరాజు, రాగం వనస్పతి)


పల్లవి:
పరియాచకమా మాట పదిగురిలో పొగడినది

అనుపల్లవి:
వేరపు నను మానంబున వేశనంబున నే కోరి శరణాగతరక్షక నిను సంతతము శరణంటే

చరణం:
ఒక మునికై ద్రోపది ద్వారక నిలయ శరణనగా
ఒక మాటకు విభీశనుడు ఓర్వలేక శరణనగా
సకలేశ్వర ప్రహ్లాదుడు జాలిచే శరణానగా
హితకారుడవై బ్రోచితివే త్యాగరాజుని మాట


Note: This one has me totally stumped. The couple of Romanized transliterations I did find on the web are confusing. So there may be way more mistakes than the usual. The parts that I think may be wrong are italicized. I am sure there are many more mistakes. If any of you that are reading this can post a meaning, I would really really appreciate it.
Here is what all I have referred to:
1. http://www.geocities.com/promiserani2/c2724.html
2. http://www.bhajanasampradaya.com/DetailsOfKeerthana.asp?san=784
3. Maharajapuram Santhanam's rendition of the కృతి on http://www.musicindiaonline.com

Thursday, June 16, 2005

ఎవరురా (త్యాగరాజు, రాగం మోహనం)

పల్లవి:
ఎవరురా నిన్నువినా గతి మాకు

అనుపల్లవి:
సవనరక్షక నిత్యోత్సవ సీతాపతి

చరణం:
రాదా నాదుపై నీ దయ వినరాదా మురవైరికాదా దయ పల్కరాదా
ఇది మరియాదా నాతో వాదమా నీ భేదమా మాకు

రాక నన్నేచ న్యాయమా పరాకా నేన్నటే హేయమా రామా
రాకాశశిముఖ నీ కాశించితి సాకు మా పుణ్య శ్లోకమా మాకు

శ్రీశారి గనారాతివి దాస తెలియక పోతివి ఆపగేశార్చిత
పాలితేశ నా ప్రకాశమా స్వప్రకాశమా మాకు

రాజా బిగు నీకేలరా త్యాగరాజార్చిత తాళజాలరా రామా
ఈ జాలము సేయ రాజ బ్రోవ సంకోచమా సురభూజమా మాకు

Tuesday, June 14, 2005

బంటురీతి (త్యాగరాజు, రాగం హంసనాదం)

పల్లవి:
బంటురీతికొలువియ్యవయ్య రామా

అనుపల్లవి:
తుంటవింటివాని మొదలైన మాదాదుల కొట్టినేల కూలజేయునిజ

చరణం:
రోమాంచమను ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్ళయు
రామనామమనే వరఖడ్గమివి రాజిల్లునయ్య త్యాగరాజునిజ

Monday, June 13, 2005

రామా నన్ను బ్రోవరా (త్యాగరాజు, రాగం హరికాంభోజీ)

పల్లవి:
రామా నన్ను బ్రోవరా ప్రేమతో లోకాభిరామా

అనుపల్లవి:
చీమలో బ్రహ్మలో శివ కేశవాదులలో ప్రేమమీర వేలకుచుంటే బిరుదు వహించిన సీతా

చరణం:
మెప్పులకై కనతావు నావు పడగ వీర వీకి తప్పు పనులు లేకయుంటే త్యాగరాజ వినుత సీతా

Monday, June 06, 2005

నెనరుంచినాను (త్యాగరాజు, రాగం మాళవి)

వల్లవి:
నెనరుంచినాను ఆన్నిటికి నిధానుడను నేను నీదుపై

అనుపల్లవి:
ఘనాఘజీముథా శుగ జలధి గంభీర నీ పాదములపై

చరణం:
కలిలొ మాటలు నెర్చుకొని కాంతలను తనయుల బ్రొచుటకు
శిలాత్ముదై పలుకా నేరనుర శ్రీ త్యాగరాజాప్తు నీయడ

Friday, June 03, 2005

యోమీ చేసితేనేమి (త్యాగరాజు, రాగం తోడి)

పల్లవి:
యోమీ చేసితేనేమి శ్రీరామ స్వామి కరుణ లేని వారిలలో

అనుపల్లవి:
కామ మోహ దాసులై శ్రీ రాముని కట్టు తేలియలేని వారిలలో

చరణం:
ఇమ్ము కలిగితేనేమి ఇల్లాలికి సోమ్ము బేట్టితే యోమి
కమ్మ విట్లు కేలిని తేలిసి యోమి తమ్మి కంటివ నీ కరుణలేని వారిలలో

సవము చేసితేనేమి కలిమిని పుత్రోత్సవము కలిగితేనేమి భువిలోనన్య
బీజ జనితుని కోని యోమి శివాకార శ్రీరాముని దయలోని వారిలలో

మోడగట్టితేనేమి అందునలందరు జోడు గట్టితేనేమి చేడియలను
మేప్పించ దేలిసితేనేమి ఇదులేని రాముని దయలేని వారిలలో

రాజ్యమేలితేనేమి బహుజనులలో పూజ్యులైతేనేమి అజ్య ప్రవాహముతో
నన్ననమిడితేనేమి పూజ్యుడైన రాముని దయలేని వారిలలో

గురువుతానైతేనేమి కంటికీ మేను గురువై తోచితేనేమి
వరమంత్రమంన్యుల కుప్పచేసితేనేమి వర త్యాగరాజ నుతుని దయలేని వారిలలో

Friday, May 27, 2005

మేలుకోవయ్యా (త్యాగరాజు, రాగం బౌళి)

పల్లవి:
మేలుకోవయ్యా మమ్మేలుకోరామా

అనుపల్లవి:
మేలైన సీతా సమేత నాభాగ్యమా

చరణం:
నారదాదులు నిన్ను కోరి నీ మహీమలౌ వారిగా పాడుచున్నారిపుడు తేల్ల
వారగా వచ్చినది శ్రీ రామ నవనీత క్షీరములు బాగుగానారగింపనువేగ
రాజరాజేశ్వరభరాజముఖసాకేత రాజసద్గుణ త్యాగరాజనుత చరణ
రాజన్యవిబుధ గణరాజాదులేల్ల నిను పుజింప కాచినారీజగముపాలింప

Thursday, May 26, 2005

శ్రీ గణపతీనీ (త్యాగరాజు, రాగం సోరాశ్ట్రం)

పల్లవి:
శ్రీ గణపతినీ సేవింపరారే శ్రిత మానవులారా

అనుపల్లవి:
వాగాధిపతి సుపూజల చేకోని బాగా నటింపుచూ వెడలిన

చరణం:
పనస నారికేళాది జంబు ఫలములనారగించి ఘన తరంబగు మహిపై పదములు
ఘల్లు ఘల్లన నుంచి అనయము హరీ చరణ యుగములను హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల దిత్తతళాగుమని వెడలిన