Tuesday, November 20, 2007

ఈ వసుధా (రాగం సహాన, త్యాగరాజు)

పల్లవి:
ఈ వసుధా నీవంటి దైవము నేనెందగానర

అనుపల్లవి:
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ

చరణం:
ఆసచే అరనమిశము నీ పురవాసమోనరజేయువారి
మది వేసటలెల్లను తోలగించి ధనరాసుల నాయవును
భూసుర భక్తియు తేజమును ఓసగి భువనమందు
కీర్తి గలగజేయు దాసవరద త్యాగరాజ హృదయ నివేశ
చిద్విలాస సుందరేశ

Sunday, November 04, 2007

నిన్నుజూచి థన్యుఢైతి (పట్నం సుబ్రమణ్యం ఐయ్యర్, రాగం సౌరాశ్ట్రం)


పల్లవి:
నిన్నుజూచి థన్యుఢైతి నీరజనేత్ర

అనుపల్లవి:
వనజాసనాది వందిత చరణ
వనజనాభ దేవ దేవాదిదేవ

చరణం:
సకలలోకాథార సచ్చిదాకార సకలజీవేశ్వర
సర్వేశ్వర సకలపాపహర సాధుహృదయవిహార
సకలవరదాయక శ్రీ వెంకటేశ్వర


Ranjani-Gayatri Rendition

Thursday, September 27, 2007

రాగసుధారస పానము చేసి (త్యాగరాజు, రాగం ఆందోళిక)

పల్లవి:
రాగ సుధారస పానము చేసి రాజిల్లవే మనసా

అనుపల్లవి:
యాగ త్యాగ యోగ భోగ ఫలమోసంగే

చరణం:
సదాశివమయమగు నాదోంకారస్వర విదులు
జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు

Tuesday, September 18, 2007

తవ దాసోహం (త్యాగరాజు, రాగం పున్నాగవరాళి)

పల్లవి:
తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే

చరణాలు:
వర మృదుభాష విరహితదోష నరవర వేశ దాశరథే

సరసిజనేత్ర పరమపవిత్ర సురపతిమిత్ర దాశరథే

నిన్ను కోరితిర నిరుపమశూర నన్నేలుకోరా దాశరథే

మనవిని వినుమా మరవ సమయమా ఇనకుల ధనమా దాశరథే

ఘనసమనీల మునిజనపాల కనకదుకూల దాశరథే

థర నీవంటి దైవము లేదంటి శరణము కోంటి దాశరథే

ఆగమ వినుత రాగ విరహిత త్యాగరాజనుత దాశరథే

Wednesday, August 29, 2007

చక్కని రాజమార్గములుండగ (త్యాగరాజు, రాగం ఖరహరప్రియ)

పల్లవి:
చక్కని రాజమార్గములుండగ సందుల దూరనేల ఓ మనస

అనుపల్లవి:
చిక్కని పాలు మీగడయుండగ శ్రీయను గంగా సాగరమేలే

చరణం:
కంటికి సుందరతరమగు రూపమే ముక్కంటి నోట చలగే నామమే
త్యాగరాజ నెలకోన్నదే దైవమే ఇటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే

తులసీ దళములచే (త్యాగరాజు, రాగం మాయామాళవగౌళ)

పల్లవి:
తులసీ దళములచే సంతోషముగా పూజింతు

అనిపల్లవి:
పలుమారు చిరకాలము పరమాత్మునిపాదములను

చరణం:
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురువక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల
ధర నీవి ఓక పరియాయము ధర్మాత్ముని
సాకేతపురవాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని

Thursday, August 23, 2007

శ్రీమన్నారాయణ (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణం

అనుపల్లవి:
కమలాసతీముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమేశరణం

చరణం:
పరమయోగిజన భాగదేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువెంకటగిరిదేవ శరణం

Wednesday, June 27, 2007

రంగనాథుడే ( పోన్నైయ పిళ్ళై, రాగం సౌరాశ్ట్రం)

పల్లవి:
రంగనాథుడే అంతరంగనాథుడే

అనుపల్లవి:
మంగళప్రదంబులిచ్చు మహాదేవునిసఖుడే

చరణాలు:
సతతము వానినామమే సంకీర్తనములు జేసిన జనుల హృదయ కమలమందు మెలగుచునున్నాడే
పతితపావన బీరుదింక పట్టియున్నాడే సద్గతియిచ్చువాడితడే గరుడగమనదోర ఇతడే

పదహారువేల స్త్రీలకు ప్రాణనాథుడితడే పరశురామ గర్వమేల్ల భంగపరచినాడే
ముదముమీర పాండవులకు మోక్షమిచ్చినాడే పరమదయాకరుడే శ్రీ ప్రహ్లాదవరదుడే

Monday, June 11, 2007

రంగపురవిహార (ముత్తుస్వామి దీక్షీతార్, రాగం బృందావన సారంగ)

పల్లవి:
రంగపురవిహార జయ కోదండరామావతార రఘువీర శ్రీ

అనుపల్లవి:
అంగజజనక దేవ బృందావన సారంగేంద్ర వరద రామాంతరంగ
శ్యామళాంగ విహంగ తురంగ సదయాపాంగ సత్సంగ

చరణం:
పంకజాప్తకులజలనిథిసోమ వరపంకజముఖ పట్టాభిరామ
పదపంకజజితకామ రఘురామ వామాంగగతసీతావర వేశ
శేశాంగశయన భక్తసంతోశ ఏనాంకరవినయన మృదుతరభాశ
అకళంకదర్పణకపోల విశేశ మునిసంకటహరణ గోవింద
వేంకటరమణ ముకుంద సంకర్ళణ మూల కంద శంకరగురుగుహానంద

Thursday, May 03, 2007

ఏహి అన్నపూర్ణే (ముత్తుస్వామి దీక్షితార్, రాగం పున్నాగవరాళి)

పల్లవి:
ఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదాపూర్ణే సువర్ణే

అనుపల్లవి:
పాహి పఞ్చాశద్వర్ణే శ్రియం దేహి రక్తవర్ణే అపర్ణే

చరణం:
కాశీక్షేత్రనివాసినీ కమలలోచన విశాలినీ విశ్వేశమనోల్లాసినీ
జగదీశ గురుగుహ పాలినీ విద్రుమపాశినీ వున్నాగవరాళీ ప్రకాశినీ
షట్రింశత్తత్వ వికాసినీ సువాసినీ భక్త విశ్వాసినీ చిదానంద విలాసిని

पल्लवि:
एहि अन्नपूर्णे सन्निधेहि सदापूर्णे सुवर्णे

अनुपल्लवि:
पाहि पञ्चाशद्वर्णे श्रियं देहि रक्तवर्णे अपर्णे

चरणम्:
काशीक्षेत्रनिवासिनि कमललोचनविशालिनि विश्वेशमनोल्लासिनि
जगदीशगुरूगुहपालिनि विद्रुमपाशिनि पुन्नागवराळीप्रकाशिनि
षट्त्रिंशत्तत्तवविकासिनि सुवासिनि भक्तविश्वासिनि चिदानन्दविलासिनि

Wednesday, May 02, 2007

గంగే మామ్పాహి (ముత్తుస్వామి దీక్షితార్, రాగం ఝింఝూటి)

పల్లవి:
గంగే మామ్పాహి గిరీశశిరస్థితే గంభీరకాయే సంగీతవాద్య ప్రియే

చరణం:
అంగజతాతముదే అసిపరుణామధ్యే అక్రూరపూజితే అఖిలజనానందే
సకలతీర్థమూలే సద్గురుగుహలీలే పరజహ్నూబాలే వ్యాసాదికృపాలే

पल्लवि:
गंगे माम्पाहि गिरीशशिरःस्थिते गंभीरकाये संगीतवाद्यप्रिये

चरणम्:
अंगजतातमुदे असिवरुणामध्ये अक्रूरपूजिते अखिलजनानन्दे
सकलतीर्थमूले सद्गुरुगुहलीले वरजह्नुबाले व्यासादिकृपाले

Tuesday, May 01, 2007

భావములోన (అన్నమయ్య, రాగం శుద్ధ ధన్యాసి)

పల్లవి:
భావములోన భాహ్యములందును గోవింద గోవింద అని కోలువవో మనసా

చరణాలు:
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి హరి అనవో మనస

విశ్ణుని మహిమలే విహిత కర్మములు విశ్ణుని పోగడేడి వేదంబులు
విశ్ణుడోక్కడే విశ్వాంతరాత్ముడు వీశ్ణువు విశ్ణువని వెదకవో మనస

అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుడు శ్రీ వేంకటాద్రీ మీదనితె అచ్యుత అచ్యుత శరణనవో మనస

Friday, April 27, 2007

శివ శివ శివ అనరాద (త్యాగరాజు, రాగం కామవర్ధిని)

పల్లవి:
శివ శివ శివ అనరాద ఓరీ

అనుపల్లవి:
భవ భయ బాధలననచుకోరాదా

చరణాలు:
కామాదులతెగకోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము ఎడబాసీ అతి నేమముతో బిల్వార్చన జేసి

సజ్జన గణముల గాంచి ఓరీ ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల తోలగించ తన హ్రజ్జలమునను తో పూజించి

అగముల నుతియించి బహు బగులేని భాశలను చలించి
భగవతులలో పోశించి ఓరీ త్యాగరాజ సన్నుతుడని ఎంచి

Tuesday, April 24, 2007

దేవాదిదేవ సదాశివ (త్యాగరాజు, రాగం సింధు రామక్రియా)

పల్లవి:
దేవాదిదేవ సదాశివ దిననాథ సుధాకర దహన నయన

అనుపల్లవి:
దేవేశ పితామహ మృగ్య శమాది గుణాభరణ గౌరీ రమణ

చరణం:
భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాశ శ్రీశనుత
తవపాదభక్తిం దేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజనుత

ఉయ్యాలలూగవయ్య (త్యాగరాజు, రాగం నీలాంబరి)

పల్లవి:
ఉయ్యాలలూగవయ్య శ్రీ రామా

అనుపల్లవి:
సయ్యాట పాటలను సత్సార్వభౌమ

చరణాలు:
కమలజాద్యఖిల సురులు నిను కోలువ
విమలులైన మునీంద్రులు ద్యానింప
కమనీయ భాగవతులు గుణ కీర్తనములు నాలాపంబుల సేయగ

నారదాదులు మెరయూచూ స్తుతియింప
సారములు బాగా వినుచూ నీన్ను
నమ్మువారల సదా బ్రోచుచూ వేద సార సఫలను జూచుచూ శ్రీ రామ

నవ మోహనాంగులైన సురసతులు వివరముగ పాడగ నీ భాగ్యమా
నవరత్న మంటపమున త్యాగరాజ వినుతాకృతీ బూనిన శ్రీ రామ

శ్రీ తులసమ్మ (త్యాగాజూ, రాగం దేవగాంధారి)

పల్లవి:
శ్రీ తులసమ్మ మాయింట నేలకోనవమ్మ ఈ మహిని
నీ సమానమేవరమ్మ బంగారు బోమ్మ

చరణాలు:
కరగు సుపర్ణపు సోమ్ములు బెట్టి
సరిగే చిర ముద్దు గురియ గట్టి
కరుణ జూచి సిరులనుయోడి గట్టి
పరదుని కరమునను బట్టి

యురమున ముత్యపు సరులసియడ
సురతరుణులు నిన్ను గని కోనియడ
వర మునులాష్ట దిగీశులు పేడ
వరదుడు నిన్ను ప్రేమ జూడ

మరువక పారిజాత సరోజ
కురవక వకుళ సుగంధరాజ
వర సమములచే త్యాగరాజ
వరద నిన్ను పూజ సేతు

Friday, April 20, 2007

మోరు సమాన (త్యాగరాజు, రాగం మాయామాళవగౌళ)

పల్లవి:
మోరు సమాన ధీర వరదా రఘువీర జుదము రారా మహా

అనుపల్లవి:
సరసర ఓయ్యారవు నడలను నీరద కాంతిని నీథీవిని మహా

చరణం:
అలకల ముద్దును తిలకపు తీరును తళుకు జెక్కులచే దనరు మెమ్మోమును
గళమున శోభిల్లు కనక భూశణముల దళిత దుర్మానవ త్యాగరాజార్చిత

Wednesday, April 18, 2007

రామా దైవమా (త్యాగరాజు, రాగం శూరుట్టీ)

పల్లవి:
రామా దైవమా
రాగ రాగ లోభామా

అనుపల్లవి:
మోము జూపుమా జగన్మోహనకరమా

చరణం:
నేర్పు జూపు అంగలార్పు బాపుమా
ఓర్పు గల్గు త్యాగరాజు ఓక్క సారి శరనన్టే

తందనాన అహి (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
తందనాన అహి తందనాన పురే తందనాన భళా తందనాన
భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట

చరణాలు:
కండువగు హీనాథికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా
ఇందులో జంతుకులం ఇంతానోకటే అందరికి శ్రీహరే అంతరాత్మా

నిండార రాజు నిద్రించు నిద్రయు ఓకటే అండనే బంటు నిత్ర అదియు ఓకటే
మెండైన బ్రహ్మణుడు మేట్టు భూమి ఓకచటే చండాలుడుండేటి సరి భూమి ఓకటే

అనుగు దేవతలకును అల కామసుఖమోకటే ఘనకీట పశువులకు కామ సుఖం ఓకటే
దినమహేరాత్రములు తేగి ధనాద్యునకోకటే వోనర నిరుపేదకును ఓకటే అవియు

కోరలు శిశ్టాన్నములు గోను నక్కలోకటే తిరుగు దుశ్టాన్నములు దిను నక్కలోక్కటే
పరగు దుర్గంథములపై వాయువోక్కటే వరుశ పరిమళముపై వాయువోకటే

కడగి యేనుగు మీద కాయు ఎంద ఓకటై పుడమి శునకముమీత పోడయునెండోకటే
కడు పుణ్యలను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామమోకటే

నన్ను పాలింవ (త్యాగరాజు, రాగం మోహనం)

పల్లవి:
నన్ను పాలింప నదచివచ్చితివో నా ప్రాణనాథ

అనుపల్లవి:
వనజనయన మోమున జూచుట జీవనమని నేనరున మనసు మర్మము తేలిసి

చరణం:
సురపతి నీలమణినిభ తనువుతో యురమున ముత్యపుసరుల చయముతో
కరమున శర కోదంఢ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత

రామచంద్రేణ సంరక్షితోహం (ముత్తుస్వామి దీక్షీతార్, రాగం మాంజి)

పల్లవి:
రామచంద్రేణ సంరక్షితోహం సీతా

అనుపల్లవి:
రమా భారథీ గౌరీ రమణ స్వరూపేణ శ్రీ

చరణాలు:
కామకోటీ సుందరేణ కమనీయ కంధరేణ
కోమల ఘనశ్యామేణ కోదండ రామేణ

మామవ హృదయస్థితేన మారుతి గీతామృతేన
మాంజీరమణి మండిత మద్గురుగుహ మానితేన

Friday, April 06, 2007

ఏ తావునరా (త్యాగరాజు, రాగం కల్యాణి)

పల్లవి:
ఏ తావునర నిలకద నీవు ఎంచి జుడ నగపడవు

అనుపల్లవి:
సీతా గౌరీ వాగీశ్వరీ యను శ్రీ రూపములందా గోవిందా

చరణం:
భూ కమలార్క నీలనభనందా లోకకోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత శివ మాథవ భ్రహ్మాదులయందా

Friday, February 16, 2007

ఓ రాజీవాక్షా (త్యాగరాజు, రాగం ఆరాభి)

పల్లవి:
ఓ రాజీవాక్షా ఓరజూపుల జూచెద వేరా నే నీకు వేరా

అనుపల్లవి:
నేరని నాపై నేరము లేనితే గారాదని పలుకు వారులేని నన్ను

చరణాలు:
మక్కువతో నిన్ను మ్రోక్కిన జనులకు దిక్కు నీవని అతి గ్రక్కున బ్రోతువని
ఎక్కువ సుజనుల ఒక్క మాటలు విని చక్కని శ్రీ రామ దక్కటి గాదరా

మితి మేరులేని ప్రకృతిలోన దగిలి నే మాటి హీనుడై సన్నుతి సేయనేరక
బతిమాలి నీవే గతియని నెర నమ్మితిని గాని నిను మరచితిన సంతతము

మావర సుగుణ ఉమావర సన్నుత దేవర దయ చేసి బ్రోవగ రాదా
పావన భక్త జనావన మహానుభావ త్యాగరాజ భావిత ఇకను

Wednesday, February 07, 2007

మామవ రఘురామా (త్యాగరాజు, రాగం సారంగ)

పల్లవి:
మామవ రఘురామా మరకతమణి శ్యామా
me-favor raghu-raama emerald-jewel dark
Favor me, O Raama of Raghu's clan, whose body is dark like an emerald.


అనుపల్లవి:
పామర జన భీమ పాలిత సుత్రామా
wicked people terrible nourished (?)
Terrible to wicked people, nourished by (?)


చరణములు:
దురితంబులు బోడుదునుమా మనసు రాదు
కలశాంబుది లోన కరుణ కరిగి బోయేనా
వినురా మరి సమరమున విథి శరము విరిగేనా
కాల సత్యము సుగుణ కాననమున నేల్చినా
దివ్య నరాపఘన దైవత్వము బోయేనా
రాజాధిప త్యాగరాజ వినుత బాగ

Sunday, February 04, 2007

నన్ను కన్న తల్లి (త్యాగరాజు, రాగం కేసరి)

పల్లవి:
నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణీ ధర్మాంబికే

అనుపల్లవి:
కనకాంగి రమాపతి సోదరీ కావవే నన్ను కాత్యాయనీ

చరణం:
కావుకావుమని నే మోరబెట్టగా కమలలోచనీ కరుగుచుండగా
నీవు బ్రోవకుంటే నన్నెవరుబ్రోతురు సదావరంబొసగు త్యాగరాజనుతే

Friday, January 12, 2007

పురహర నందన (ముత్తుస్వామి ధీక్షితార్, రాగం హమీరకల్యాణి)

పల్లవి:
పురహర నందన రిపుకుల భంజన
pura-hara nandana ripu-kula bhanjana
city-destroyer child enemy-race destroyer
Son of the destroyer of the three cities,
The destroyer of the entire race of his enemies,

శిఖీంద్రవాహన మహేంద్ర పాలన
shikhiindra vaahana mahendra paalana
peacock-king-vehicle great-indra protector
He rides the king of peacocks,
And protects the king of gods,

చరణం:
కరుణాంమృత (రస) సాగర తరుణాంమృత ధర శేఖర
karuNaamrita (rasa) saagara taruNaamritadhara shekhara
mercy-nectar ocean young-moon-wearing forehead
Ocean of mercy.
His forehead adorned with the crescent moon,

పురివైరిబాల సురవైరికాల గురుగుహ సరసిజకర స్కందలీల
pura-vairi-baala sura-vairi-kaala guruguha sarasija-kara skandaliila
city-enemy-son god-enemy-death guruguha lotus-hand (?)
The enemy of the three cities is your father.
Death to the enemies of the gods,
Named Guruguha,
With lotus-like hands,
You revel in war.

Wednesday, January 10, 2007

నన్ను విడచి (త్యాగరాజు, రాగం రీతిగౌళ)

పల్లవి:
నన్ను విడచి కదలకురా
nannu viDachi kadalakuraa
me leave move-don't (away)

Don't leave me and move away.
రామయ్య రామ
raamayya raama
(కోదండ రామా)
kondanDa raama
(పట్టాభి రామా)
pattabhi raama
(కల్యాణ రామా)
kalyaaNa raama
రామయ్యవదలకురా
raamayya vadalakuraa
raama-father leave-don't

Don't leave me, raama, my father.

అనుపల్లవి:
నిన్ను బాసీ యరనిమిషమోర్వనురా
ninnu baasi yara-nimishamu-uurvanuraa
you (?) half-minute-(?)


చరణాలు:
తరము గాని యండవేళ
tharamu gaani yenDaveLa
unbearable heat-time

కల్పతరునీడ దోరికినట్లాయే ఈ వేళ
kalpataru-neeDa dorikinatLaaye ee veLa
kalpa-tree-shadow find-like this time

I feel like I would feel on finding the shadow of the kalpa tree at a time of unbearable heat.

అబ్దిలో మునిగి శ్వాసమును పట్టి
abdhi-lo munigi shvaasamunu paTTi
sea-in dive breath hold

ఆణిముత్యము కన్నట్లాయే శ్రీ రామణ
aaNi-muthyamu kannaTlaaye shrii ramaNa
(?)-pearl see-like shrii('s) joy

O joy of lakshmii, I feel like I have found a (?) pearl after diving into the ocean, holding my breath.

వసుథను ఘననము చేసి
vasudhanu ghananamu chesi
earth (?) did

థనభాండమబ్బిన రీతి కనుకోంటి దాసి
dhana-bhaandambbina reethi kanukonTi daasi
wealth-store-find like (?) (?)


వడలు తగిలియున్న వేళ గోప్పవడగండ్లు
vaDalu tagiliyunna veLa goppavaDagamDlu
కురిసినట్లాయే ఈ వేళ
kurisinaTlaaye ee veLa
rain-like this time


బాగుగా నన్నేలుకోరా వరత్యాగరాజనుత
baagugaa nannelukora vara-tyaagaraajanuta
well me-take-care ever-tyaagaraaja-worshipped

Take good care of me, lord of tyaagaraaja.
ఈ తనువు నీదేరా
ee tanuvu neederaa
this body yours

This body of mine belongs to you.

Thursday, January 04, 2007

రామా నీ సమానమెవరు (త్యాగరాజు, రాగం ఖరహరప్రియ)

పల్లవి:
రామా నీ సమానమెవరు రఘువంశోద్ధారక

అనుపల్లవి:
భామా మరువంపు మోలక భక్తియను పింజరపు చిలక

చరణం:
పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు సోదరులుగల
హరి త్యాగరాజకుల విభూశణ మృదు భాశణ

Wednesday, January 03, 2007

రామచంద్ర నీ దయ (త్యాగరాజు, రాగం శూరూత్తి)

పల్లవి:
రామచంద్ర నీ దయ రామ ఏల రాదయ

అనుపల్లవి:
కామకోటి సుందర కరధృత మంధర
ప్రేమమీర ముందురా బిలువ రాక యుందురా

చరణములు:
కాననంబు తాపమో కైక మీది కోపమో
నేను జేయు పాపమో నీకు శక్తి లోపమో

ఆడన్న రోశమో అలనాడు పాశమో
మేడలేని వాసమో మేము సేయు దోశమో

కల్లనైన నేయమా కంటే నీకు హేయమా
తల్లడిల్ల న్యాయమా త్యాగరాజ గేయమా