Thursday, September 27, 2007

రాగసుధారస పానము చేసి (త్యాగరాజు, రాగం ఆందోళిక)

పల్లవి:
రాగ సుధారస పానము చేసి రాజిల్లవే మనసా

అనుపల్లవి:
యాగ త్యాగ యోగ భోగ ఫలమోసంగే

చరణం:
సదాశివమయమగు నాదోంకారస్వర విదులు
జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు

Tuesday, September 18, 2007

తవ దాసోహం (త్యాగరాజు, రాగం పున్నాగవరాళి)

పల్లవి:
తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే

చరణాలు:
వర మృదుభాష విరహితదోష నరవర వేశ దాశరథే

సరసిజనేత్ర పరమపవిత్ర సురపతిమిత్ర దాశరథే

నిన్ను కోరితిర నిరుపమశూర నన్నేలుకోరా దాశరథే

మనవిని వినుమా మరవ సమయమా ఇనకుల ధనమా దాశరథే

ఘనసమనీల మునిజనపాల కనకదుకూల దాశరథే

థర నీవంటి దైవము లేదంటి శరణము కోంటి దాశరథే

ఆగమ వినుత రాగ విరహిత త్యాగరాజనుత దాశరథే