Showing posts with label పోన్నయ్య పిళ్ళై. Show all posts
Showing posts with label పోన్నయ్య పిళ్ళై. Show all posts

Wednesday, June 27, 2007

రంగనాథుడే ( పోన్నైయ పిళ్ళై, రాగం సౌరాశ్ట్రం)

పల్లవి:
రంగనాథుడే అంతరంగనాథుడే

అనుపల్లవి:
మంగళప్రదంబులిచ్చు మహాదేవునిసఖుడే

చరణాలు:
సతతము వానినామమే సంకీర్తనములు జేసిన జనుల హృదయ కమలమందు మెలగుచునున్నాడే
పతితపావన బీరుదింక పట్టియున్నాడే సద్గతియిచ్చువాడితడే గరుడగమనదోర ఇతడే

పదహారువేల స్త్రీలకు ప్రాణనాథుడితడే పరశురామ గర్వమేల్ల భంగపరచినాడే
ముదముమీర పాండవులకు మోక్షమిచ్చినాడే పరమదయాకరుడే శ్రీ ప్రహ్లాదవరదుడే