Friday, February 16, 2007

ఓ రాజీవాక్షా (త్యాగరాజు, రాగం ఆరాభి)

పల్లవి:
ఓ రాజీవాక్షా ఓరజూపుల జూచెద వేరా నే నీకు వేరా

అనుపల్లవి:
నేరని నాపై నేరము లేనితే గారాదని పలుకు వారులేని నన్ను

చరణాలు:
మక్కువతో నిన్ను మ్రోక్కిన జనులకు దిక్కు నీవని అతి గ్రక్కున బ్రోతువని
ఎక్కువ సుజనుల ఒక్క మాటలు విని చక్కని శ్రీ రామ దక్కటి గాదరా

మితి మేరులేని ప్రకృతిలోన దగిలి నే మాటి హీనుడై సన్నుతి సేయనేరక
బతిమాలి నీవే గతియని నెర నమ్మితిని గాని నిను మరచితిన సంతతము

మావర సుగుణ ఉమావర సన్నుత దేవర దయ చేసి బ్రోవగ రాదా
పావన భక్త జనావన మహానుభావ త్యాగరాజ భావిత ఇకను

Wednesday, February 07, 2007

మామవ రఘురామా (త్యాగరాజు, రాగం సారంగ)

పల్లవి:
మామవ రఘురామా మరకతమణి శ్యామా
me-favor raghu-raama emerald-jewel dark
Favor me, O Raama of Raghu's clan, whose body is dark like an emerald.


అనుపల్లవి:
పామర జన భీమ పాలిత సుత్రామా
wicked people terrible nourished (?)
Terrible to wicked people, nourished by (?)


చరణములు:
దురితంబులు బోడుదునుమా మనసు రాదు
కలశాంబుది లోన కరుణ కరిగి బోయేనా
వినురా మరి సమరమున విథి శరము విరిగేనా
కాల సత్యము సుగుణ కాననమున నేల్చినా
దివ్య నరాపఘన దైవత్వము బోయేనా
రాజాధిప త్యాగరాజ వినుత బాగ

Sunday, February 04, 2007

నన్ను కన్న తల్లి (త్యాగరాజు, రాగం కేసరి)

పల్లవి:
నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణీ ధర్మాంబికే

అనుపల్లవి:
కనకాంగి రమాపతి సోదరీ కావవే నన్ను కాత్యాయనీ

చరణం:
కావుకావుమని నే మోరబెట్టగా కమలలోచనీ కరుగుచుండగా
నీవు బ్రోవకుంటే నన్నెవరుబ్రోతురు సదావరంబొసగు త్యాగరాజనుతే