Tuesday, November 20, 2007

ఈ వసుధా (రాగం సహాన, త్యాగరాజు)

పల్లవి:
ఈ వసుధా నీవంటి దైవము నేనెందగానర

అనుపల్లవి:
భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ

చరణం:
ఆసచే అరనమిశము నీ పురవాసమోనరజేయువారి
మది వేసటలెల్లను తోలగించి ధనరాసుల నాయవును
భూసుర భక్తియు తేజమును ఓసగి భువనమందు
కీర్తి గలగజేయు దాసవరద త్యాగరాజ హృదయ నివేశ
చిద్విలాస సుందరేశ

Sunday, November 04, 2007

నిన్నుజూచి థన్యుఢైతి (పట్నం సుబ్రమణ్యం ఐయ్యర్, రాగం సౌరాశ్ట్రం)


పల్లవి:
నిన్నుజూచి థన్యుఢైతి నీరజనేత్ర

అనుపల్లవి:
వనజాసనాది వందిత చరణ
వనజనాభ దేవ దేవాదిదేవ

చరణం:
సకలలోకాథార సచ్చిదాకార సకలజీవేశ్వర
సర్వేశ్వర సకలపాపహర సాధుహృదయవిహార
సకలవరదాయక శ్రీ వెంకటేశ్వర


Ranjani-Gayatri Rendition