Thursday, May 26, 2005

శ్రీ గణపతీనీ (త్యాగరాజు, రాగం సోరాశ్ట్రం)

పల్లవి:
శ్రీ గణపతినీ సేవింపరారే శ్రిత మానవులారా

అనుపల్లవి:
వాగాధిపతి సుపూజల చేకోని బాగా నటింపుచూ వెడలిన

చరణం:
పనస నారికేళాది జంబు ఫలములనారగించి ఘన తరంబగు మహిపై పదములు
ఘల్లు ఘల్లన నుంచి అనయము హరీ చరణ యుగములను హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల దిత్తతళాగుమని వెడలిన

No comments: