Friday, August 05, 2005

దినమణి వంశ (త్యాగరాజు, రాగం హరికాంభోజి)


పల్లవి:
దినమణి వంశ తిలకలావణ్యా దీన శరణ్య

అనుపల్లవి:
మనవిని బాగుగా మదిని దలంచుచూ చనువునన్నేలు జాలు

చరణం:
శర్వ వినుత నన్ను సంరక్షించను గర్వము ఏల గాచు వారెవరే
నిర్వికార గుణ నిర్మల కరధృతపర్వత త్యాగరాజ సర్వస్వమో

మరుగేలరా ఓ రాఘవా (త్యాగరాజు, రాగం జయంతశ్రీ)



పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా

అనుపల్లవి:
మరుగేలరా చరాచరరూప పరాత్పర సుర్యసుధాకరలోచనా

చరణం:
అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసికోంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నోరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత