Saturday, January 21, 2006

శోభనే (త్యాగరాజు, రాగం కామవర్ధిని)

వదన ద్యుతి జిత సోమ వసుధా మానవ కామ
మద మానవ గణ భీమ మామ్పాహి శ్రీరామా

జనకసుతా హృద్రమణ జమదగ్నిజ మదహరణ
ప్రణతాఘానల వరుణ పాహిమామ్ ముని శరణ

విగళిత మోహపాశ విధుకోటి సంకాశ
భగవన్ సకలాధీశ్ పాహీ పాప వినాశ

వర త్యాగరాజనుత వారిజసంభవ తాత
పరమ కల్యాణయుత పాహిమామ శుభచరిత

ఎన్నాగ మనసుకు రాని (త్యాగరాజు, రాగం నీలాంబరి)

వల్లవి:
ఎన్నాగ మనసుకు రాని పన్నగషాయీ సోగసూ
పన్నుగ కనుగోననీ కన్నులేలే కంటీ మిన్నలేలే

చరణం:
మోహముతో నీలవారీ వాహ కాంతీని గేరిన
శ్రీహరినీ గట్టుకోననీ దేహమేలే ఈ గేహమేలే

సరసిజ మల్లే తులసీ వీరుజాజి పారిజాతపు
విరులచే పూజించనీ కరములేలే ఈ కాపూరములేలే

మలిమితో త్యాగరాజునేలిన రామమూర్తినీ
లాలించి పోగడనీ నాలికేలే సూత్రమాలికేలే