Sunday, November 19, 2006

జో అచ్చుతానంద (అన్నమయ్య, రాగం నవరోజ్)


పల్లవి:
జో అచ్చుతానంద జో జో ముకుందా
రావె పరమానంద రామగోవింద

చరణం:
నందునింటను జేరి నయము మీరంగ
చంద్ర వదనలు నీకు సేవచేయంగ
అందముగ వారింట్ల ఆడుచుందంగ
మండలకు దోంగ మా ముద్దు రంగ

అంగజుని కన్న మాయన్న యిటురారా
బంగారు గిన్నెల్లో పాలు పోసేరా
దోంగ నీవని సతులు పోంగుచున్నారా
ముంగిట ఆడరా మోహనాకార

అంబుగా తాళ్ళపాకన్నమయ్య చాల
శృగార రచనగా చెప్పెనే జోల
సంగతిగ సకల సంపదలనీవేల
మంగళము తిరుపట్ల మదన గోపాల

Saturday, November 04, 2006

ముద్దుగారే యశోద (అన్నమయ్య, రాగం కురింజి)

పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

చరణం:
అంతనింత గోల్లేతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసునీ పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
చెంతల మాలోనున్న చిన్ని కృశ్నుడు

రతికేళి రుక్మిణికీ రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంకచక్రాల సందుల వైడూర్యము
గతేయె మమ్మూగాచే కమలాక్షుడూ

కాళింగుని తలపై గప్పిన పుశ్యరాగము
యోలేటి శ్రీవెంకటాద్రీ ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయనీ దివ్య రత్నము
బాలునివలే తిరిగే పద్మనాభుడు

నిరవధి సుఖదా (త్యాగరాజు, రాగం రవిచంద్రిక)

పల్లవి:
నిరవధి సుఖదా నిర్మల రూప నీర్జిత మనిశాపా

అనుపల్లవి:
శరధి బందన నత సంక్రందన శంకరాది గీయమాన సాధు మానస సుసదన

చరణం:
మామవ మరకట మణినిభదేహ శ్రీమణిలోల శ్రితజన పాల
భీమ పరాక్రమ భీమ కరార్చిత తామస మానవ దూర త్యాగరాజ వినుత చరణ