Thursday, August 23, 2007

శ్రీమన్నారాయణ (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణం

అనుపల్లవి:
కమలాసతీముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమేశరణం

చరణం:
పరమయోగిజన భాగదేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువెంకటగిరిదేవ శరణం

1 comment:

Anonymous said...

మంచి ప్రయత్నం....కర్నాటక కాదండి...కర్ణాటక సరియైనది.