Wednesday, July 20, 2005

రామా కోదండరామా (త్యాగరాజు, రాగం భైరవి)

పల్లవి:
రామా కోదండరామా రామా కల్యణరామా

చరణం:
రామా సీతాపతి రామా నీవే గతి
రామా నీకు మ్రోక్కితి రామా నీ చేచిక్కితి

రామా నీకేవరు జోడు రామా క్రిగంట చూడు
రామా నేను నీవాడు రామా నాతో మాటాడు

రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామా నీవు నన్నేలు రామ రాయడే చాలు

రామా నీదోక్కమాట రామా నాకోక్కమూట
రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట

రామా నేనండైనను రామా వేరెంచలేను
రామా ఏన్నడైనను రామా బాయకలేను

రామా విరాజరాజ రామా ముఖజీత రాజ
రామా భక్తసమాజ రక్షిత త్యాగరాజ

లావణ్య రామా (త్యాగరాజు, రాగం పూర్ణశడ్జం)

వల్లవి:

లావణ్య రామా కన్నులారా చూడవే అతి

అనుపల్లవి:
శ్రీ వనితా చిత్త కుముదా సీతాకర శతాననజన్య

చరణం:
నీ మనసూ నీ సౌగసు నీ దినుసూ వేరే
తమసమాన దైవమేల త్యాగరాజనుత దివ్య


(1) Pallavi audio: Excerpt from Veena recital by Veena R. Jayathi, iTunes.

Tuesday, July 19, 2005

సీతమ్మ మాయమ్మ (త్యాగరాజు, రాగం వసంత)

పల్లవి:
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకుతండ్రి

అనుపల్లవి:
వాతాత్మజ సౌమిత్రీ వైనధేయ రిపుమర్దన
ధాతా భరతాదులు సోదరులు మాకు ఓ మనస

చరణం:
పరమేశ వసిశ్ట పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధరణిజ భార్గవతాఘ్రే సరులేవ్వరు వరేల్లను
వర త్యాగరాజునికి పరమబాంధవులు మనస