Tuesday, July 19, 2005

సీతమ్మ మాయమ్మ (త్యాగరాజు, రాగం వసంత)

పల్లవి:
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకుతండ్రి

అనుపల్లవి:
వాతాత్మజ సౌమిత్రీ వైనధేయ రిపుమర్దన
ధాతా భరతాదులు సోదరులు మాకు ఓ మనస

చరణం:
పరమేశ వసిశ్ట పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధరణిజ భార్గవతాఘ్రే సరులేవ్వరు వరేల్లను
వర త్యాగరాజునికి పరమబాంధవులు మనస

No comments: