Wednesday, July 20, 2005

రామా కోదండరామా (త్యాగరాజు, రాగం భైరవి)

పల్లవి:
రామా కోదండరామా రామా కల్యణరామా

చరణం:
రామా సీతాపతి రామా నీవే గతి
రామా నీకు మ్రోక్కితి రామా నీ చేచిక్కితి

రామా నీకేవరు జోడు రామా క్రిగంట చూడు
రామా నేను నీవాడు రామా నాతో మాటాడు

రామ నామమే మేలు రామ చింతనే చాలు
రామా నీవు నన్నేలు రామ రాయడే చాలు

రామా నీదోక్కమాట రామా నాకోక్కమూట
రామా నీ పాటే పాట రామా నీ బాటే బాట

రామా నేనండైనను రామా వేరెంచలేను
రామా ఏన్నడైనను రామా బాయకలేను

రామా విరాజరాజ రామా ముఖజీత రాజ
రామా భక్తసమాజ రక్షిత త్యాగరాజ

1 comment:

Harish Sivaramakrishnan said...

i cant read telugu ,so couldnt figure out what u have written! do u have an english blog?