Wednesday, August 29, 2007

చక్కని రాజమార్గములుండగ (త్యాగరాజు, రాగం ఖరహరప్రియ)

పల్లవి:
చక్కని రాజమార్గములుండగ సందుల దూరనేల ఓ మనస

అనుపల్లవి:
చిక్కని పాలు మీగడయుండగ శ్రీయను గంగా సాగరమేలే

చరణం:
కంటికి సుందరతరమగు రూపమే ముక్కంటి నోట చలగే నామమే
త్యాగరాజ నెలకోన్నదే దైవమే ఇటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే

తులసీ దళములచే (త్యాగరాజు, రాగం మాయామాళవగౌళ)

పల్లవి:
తులసీ దళములచే సంతోషముగా పూజింతు

అనిపల్లవి:
పలుమారు చిరకాలము పరమాత్మునిపాదములను

చరణం:
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురువక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల
ధర నీవి ఓక పరియాయము ధర్మాత్ముని
సాకేతపురవాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని

Thursday, August 23, 2007

శ్రీమన్నారాయణ (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణం

అనుపల్లవి:
కమలాసతీముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమేశరణం

చరణం:
పరమయోగిజన భాగదేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువెంకటగిరిదేవ శరణం