జంబూపతే మాం పాహి నిజానంద బోధం దేహి
అనుపల్లవి:
అంబుజాసనాది సకల దేవ నమన
తుంబురు నుత హృదయ తావోపశమన
అంబుధి గంగా కావేరీ యమున
కంబు కంఠ్యఖిలాణ్డేశ్వరీ రమ
చరణం:
పర్వతజా ప్రార్థితాపలింగ విభో
పఙ్చ భూతమయ ప్రపఙ్చ ప్రభో
సర్వజీవ దయాకర శంభో
శర్వ కరుణాసుధాసింథో
శరణాగతవత్సల ఆర్తబంథో
అనీర్వచనీయ నాద బిందో
నిత్య మైళి విథృత గంగేందో
నిర్వికల్పక సమాధినిష్ట శివ కల్పకతరో
నివిశేష చైతన్య నిరఙ్జన గురుగుహ గురో