Tuesday, March 05, 2013

శ్రీ మాతృభూతం (కానడ, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
శ్రీ మాతృభూతం త్రిశిరగిరినాథం
హృది చింతయే సుగంధి కుంతళాంబా సమేతం

అనుపల్లవి:
సోమసఖం నత శుక సనకం
నల కామాది విజయ కమనీయాంగం
సోమం శీరోధృత సూర్యగంగం
కోమళకర ధృత కురంగం
గురుగుహంతరంగలింగం

చరణం:
వాసవాదిదేవ వందిత చరణం వైశ్యజాతి స్త్రీ వేశధరణం
వాసుదేవ మహితం భవతరణం వాసనాదిరహితాన్తఃకరణం
దరహాసత్రివురాదిహరణం వాసుకీప్రముఖాభరణం
భానమాననవావరణం దాసజనసంతోషకరణం
సువాసితనవజవంతిపుష్పవికాసప్రియహృదయం సదయం
మాసవర్షపక్షోత్సవవిభవం సదాశివం పరమశివం

No comments: