Friday, February 21, 2014

చలమేలజేసేవయ్య (వర్ణం, రాగం నాటకురుంజి, ములైవీడు రంగస్వామి నట్టువనారు)

పల్లవి:
చలమేలజేసేవయ్య చక్కని మా రంగయ్య

అనుపల్లవి:
కలకాలము నీ పాదములే గతియని నమ్మియుండగ
కరిమోరలిడ విని రయమున వెడలి మకరిని దునిమి
కరివరదుడని బిరుదు ధరను వెలసి సురుల పోగడగలిగిన
పతితపావనుడా నా మనవి విన

చరణం:
నన్ను బ్రోవ భారమా

ఇదే బాగని యురకను నీవున్న నిను నే విడచెదన

నీదు స్మరణ గాక వేరే ఏరుగను నీరజ నయన దనుజ మద హరణ

అండాడములకునధిపతివని నిండ మోరలిడగ వినివినక యిండ
సరియగున మదన జనకుండ వరమోసగి అనుదినము

ఆద్రోపదికి వలువ సభలో తరుగకను ఓసగిన మహాదయగలనిను
పోగడను నా తరమగున సిరి వెలయు రంగపురిని ఏలినపతి
నాగల రంగని కోమరుండ తెలిసితెలియక నదచిన పలు నడతలను
మది తలుప వలదు వలదు శరణు మురహరి

No comments: