Thursday, June 16, 2005

ఎవరురా (త్యాగరాజు, రాగం మోహనం)

పల్లవి:
ఎవరురా నిన్నువినా గతి మాకు

అనుపల్లవి:
సవనరక్షక నిత్యోత్సవ సీతాపతి

చరణం:
రాదా నాదుపై నీ దయ వినరాదా మురవైరికాదా దయ పల్కరాదా
ఇది మరియాదా నాతో వాదమా నీ భేదమా మాకు

రాక నన్నేచ న్యాయమా పరాకా నేన్నటే హేయమా రామా
రాకాశశిముఖ నీ కాశించితి సాకు మా పుణ్య శ్లోకమా మాకు

శ్రీశారి గనారాతివి దాస తెలియక పోతివి ఆపగేశార్చిత
పాలితేశ నా ప్రకాశమా స్వప్రకాశమా మాకు

రాజా బిగు నీకేలరా త్యాగరాజార్చిత తాళజాలరా రామా
ఈ జాలము సేయ రాజ బ్రోవ సంకోచమా సురభూజమా మాకు

2 comments:

Anonymous said...

ఎవరురా (!ఎవరూరా)

సవనరక్షక (సజ్జనరక్షక ?)

I understood very little of the remaining lines.

సतीsh said...

ఎవరురా (!ఎవరూరా)
Fixed.

సవనరక్షక (సజ్జనరక్షక ?)
See below.

I understood very little of the remaining lines.
This page has a nice explanation of the meaning of this కృతి.

Thanks for taking the time to proofread this.