పల్లవి:
కన కన రుచిరా కనకవసన నిన్ను
అనుపల్లవి:
దినదినమును అను దినదినమును మనసున చనువున నిన్ను
చరణం:
పాలుగారు మోమున శ్రీ అపార మహిమ దనరు నీన్ను
తళతళమను ముఖ కళ గలిగిన సీత కులుకుచూ ఓర కన్నులను జుచె నిన్ను
బాలార్కాభిసుచేల మణిమయ మాలాలంకృత కంధర సరసిజాక్ష
వరకపోల సురుచిర కిరీట ధర సంతతంబు మనసారగ
సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణశూమైన మాటలు వీనుల జురూకున తాళక శ్రీహరిని థ్యానించి సుఖియింపగలేదా యటు
మృదమదలలామ శుభనితిలవర జటాయు మోక్ష ఫలద పవమానసుతుడు నీదు మహిమ తెల్ప సీత తెలిసి వలచి సోక్క లేదా రీతి నిన్ను
సుఖాస్పదా విముఖాంబుదర పవన విదేహ మానస విహారాప్త సురపుజ మానిత గుణాంక చిదానంద ఖగతురంగ ధృతరథాంగ పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే
కామించీ ప్రేమమీర కరముల నీదు పాద కమలముల్పట్టుకోన్నవాడు సాక్షి రామనామ రసికుడు కైలాససదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శోనక పురంధర నగజ ధరజ ముఖ్యులు సాక్షి కాద సుందరేశ సుఖ కలశాంబుదివాస శ్రితులకే
సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముద హిత వరదా నిన్ను
Saturday, July 15, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment