పల్లవి:
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
అనుపల్లవి:
చందురూవర్ణుని అందచందమునూ హృదయారవిందమున జుచి బ్ర్మహానందమనుభవించువారెందరో
చరణం:
సామగానలోల మనసిజలావణ్య ధన్యు మూర్ధన్యులెందరో
మానసవనచరవర సంచారము నిలిపి మూర్తి బగుగా పోగడనే వారెందరో
సరగుణ పాదములకు స్వాంతమును సరోజమును సమర్పణము సేయుపారెందరో
పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమార్గముతోను పాడుచును సల్లాపముతో స్వరలయాదిరాగములు తెలియువారెందరో
హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటులిలలో తెలివితో చెలిమితో కరుణగల్గి జగమెల్లను సుధాదృశ్టిచే బ్రోచువారెందరో
హోయలు మీర నదలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులకశరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశముగలవారెందరో
పరమభాగవత మోనివరశశి విభాకర సనక సనందన దిగిశ సుర కింపురుశ కనకక కశిపు సుత నారద తుంబురూ పవనసూను భాలచంద్రధర శుక సరోజభవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదానుభవులుగాక ఎందరో
నీ మేను నామవైభవంబులను ని పరాక్రమ ధేర్యము శాంతమానసము నీవులను వచన సత్యమును రఘువర నీయడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమదినెరింగి సంతతంబునను గుణ భజనానంద కిర్తనము సేయువారెందరో
భాగవత రామాయణ గితాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాతి శంన్మతముల గూఢములన్ మప్పది ముక్కోటి సురాంతరంగములభావంబులనెరిగి భావరాగలయాది సోఖ్యముచే చిరాయువుల్గల్గి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవారెందరో
ప్రేమమూపిరి గోనువేళ నామమునుతలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనవారెందరో
Saturday, July 15, 2006
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment