Sunday, February 04, 2007

నన్ను కన్న తల్లి (త్యాగరాజు, రాగం కేసరి)

పల్లవి:
నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణీ ధర్మాంబికే

అనుపల్లవి:
కనకాంగి రమాపతి సోదరీ కావవే నన్ను కాత్యాయనీ

చరణం:
కావుకావుమని నే మోరబెట్టగా కమలలోచనీ కరుగుచుండగా
నీవు బ్రోవకుంటే నన్నెవరుబ్రోతురు సదావరంబొసగు త్యాగరాజనుతే

No comments: