Friday, February 16, 2007

ఓ రాజీవాక్షా (త్యాగరాజు, రాగం ఆరాభి)

పల్లవి:
ఓ రాజీవాక్షా ఓరజూపుల జూచెద వేరా నే నీకు వేరా

అనుపల్లవి:
నేరని నాపై నేరము లేనితే గారాదని పలుకు వారులేని నన్ను

చరణాలు:
మక్కువతో నిన్ను మ్రోక్కిన జనులకు దిక్కు నీవని అతి గ్రక్కున బ్రోతువని
ఎక్కువ సుజనుల ఒక్క మాటలు విని చక్కని శ్రీ రామ దక్కటి గాదరా

మితి మేరులేని ప్రకృతిలోన దగిలి నే మాటి హీనుడై సన్నుతి సేయనేరక
బతిమాలి నీవే గతియని నెర నమ్మితిని గాని నిను మరచితిన సంతతము

మావర సుగుణ ఉమావర సన్నుత దేవర దయ చేసి బ్రోవగ రాదా
పావన భక్త జనావన మహానుభావ త్యాగరాజ భావిత ఇకను

No comments: