Wednesday, August 29, 2007

తులసీ దళములచే (త్యాగరాజు, రాగం మాయామాళవగౌళ)

పల్లవి:
తులసీ దళములచే సంతోషముగా పూజింతు

అనిపల్లవి:
పలుమారు చిరకాలము పరమాత్మునిపాదములను

చరణం:
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురువక
కరవీర మల్లిక సుగంధరాజ సుమముల
ధర నీవి ఓక పరియాయము ధర్మాత్ముని
సాకేతపురవాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని