Tuesday, April 24, 2007

ఉయ్యాలలూగవయ్య (త్యాగరాజు, రాగం నీలాంబరి)

పల్లవి:
ఉయ్యాలలూగవయ్య శ్రీ రామా

అనుపల్లవి:
సయ్యాట పాటలను సత్సార్వభౌమ

చరణాలు:
కమలజాద్యఖిల సురులు నిను కోలువ
విమలులైన మునీంద్రులు ద్యానింప
కమనీయ భాగవతులు గుణ కీర్తనములు నాలాపంబుల సేయగ

నారదాదులు మెరయూచూ స్తుతియింప
సారములు బాగా వినుచూ నీన్ను
నమ్మువారల సదా బ్రోచుచూ వేద సార సఫలను జూచుచూ శ్రీ రామ

నవ మోహనాంగులైన సురసతులు వివరముగ పాడగ నీ భాగ్యమా
నవరత్న మంటపమున త్యాగరాజ వినుతాకృతీ బూనిన శ్రీ రామ

No comments: